Header Banner

బెజవాడలో మ్యూజికల్ నైట్.. ఒకే టేబుల్ వద్ద చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ!

  Sat Feb 15, 2025 21:57        Politics

తలసేమియా బాధిత చిన్నారులను ఆదుకునేందుకు నిధుల సేకరణ కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ విజయవాడలో యుఫోరియా మ్యూజికల్ నైట్ పేరిట కార్యక్రమం ఏర్పాటు చేసింది. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీత సారథ్యంలో ఈ మ్యూజికల్ నైట్ జరిగింది. బెజవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన యుఫోరియా మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృప్ణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్, బాలయ్య ఒకే టేబుల్ వద్ద కూర్చుని తమన్ సంగీత విభావరిని ఆస్వాదించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ఇటీవల మాట్లాడుతూ, సాధారణంగా చంద్రబాబు ఖర్చులకు తానే డబ్బులు ఇస్తుంటానని, కానీ ఈ కార్యక్రమం కోసం చంద్రబాబు తన సొంత ఖాతాలోంచి డబ్బు తీసి టికెట్ కొన్నారని వెల్లడించారు. చంద్రబాబు ఒక టేబుల్ బుక్ చేసుకున్నారని తెలిపారు. కాగా, కూటమి ప్రభుత్వ పెద్దలు ఒకే టేబుల్ వద్ద కూర్చున్న దృశ్యాలతో కూడిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఎంతగానో ఎదురు చూస్తున్న శుభవార్త! వల్లభనేని వంశీ హైదరాబాద్ లో అరెస్టు! పండుగ చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. మ‌రో 8 నెల‌ల్లో.. ఎమ్మెల్యే బాలకృష్ణ కీలక ప్రకటన!

 

జగన్ చాప్టర్ క్లోజ్.. అలా ఎవరైనా వాగితే.. బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు!

 

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలోనే.. ఇబ్బందులు ఉంటే డైరెక్ట్ గా మంత్రులతోనే మాట్లాడవచ్చు.. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవిగో..

 

తమన్ కు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్! టాలెంట్‌ను అభినందించడంలో ఆయన స్టైలే వేరు!

 

పాలిటెక్నిక్ రంగంలో అద్భుతమైన అవకాశాలు! నిపుణులు ఏం చెప్తున్నారంటే!

 

టోల్ ప్లాజా కొత్త నిబంధనలు.. కారులో వెళ్తున్నారా.? ఈ తప్పు చేస్తే డబుల్‌ టోల్‌ చెల్లించాల్సిందే.!

 

జగన్ హయాంలో టీడీపీ ఎమ్మెల్యేపై అక్రమ కేసు నమోదు! కారణం ఇదే! వైసీపీ నేతల గుట్టురట్టు!

 

వైసీపీకి మరో బిగ్ షాక్..! టీడీపీ ఎమ్మెల్యేపై దాడి కేసులో కీలక నేతపై ఎఫ్‌ఐఆర్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations